గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూసేవాలా మృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటుండగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తమ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మే 29న మూసేవాలాపై రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తగ్గించిన ఒక రోజు తర్వాత గుర్తుతెలియని హంతకులు అతడిని కాల్చి చంపారు. ఈ దాడిలో అతనితో పాటు జీపులో వెళ్తున్న బంధువు, స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మన్ ఇప్పటికే ప్రకటించారు.మే 28న, పంజాబ్ ప్రభుత్వం సిద్ధూ మూసేవాలా అని కూడా పిలువబడే శుభదీప్ సింగ్ సిద్ధూతో సహా 424 మంది వ్యక్తుల రక్షణను రద్దు చేసింది లేదా పరిమితం చేసింది. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement