దేశప్రజలందరికీ ప్రతినిధి అయిన అత్యంత కీలకమైన వ్యక్తికి పటిష్ట భద్రతని కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీని రైతులు అడ్డగించడంపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనని సిగ్గు చేటుగా అభివర్ణించారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. పంజాబ్ లో జరిగినది నిజంగా అవమానకరం. గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేత, ప్రతినిధి. 140 కోట్ల ప్రజల గొంతుక. ఆయనపై దాడి అంటే ప్రతీ భారతీయుడిపై దాడి అవుతుంది. ఇది మన ప్రజాస్వామ్యంపైనే దాడి. పంజాబ్ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. వారిని ఇప్పుడు కనుక నిలువరించకపోతే.. తర్వాత దేశం మొత్తం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మోడీకి అండగా భారత్ నిలుస్తుంది’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..