ముచ్చింతల్ లోని త్రిదండీ చినజీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న రామనుజుల స్వామి విగ్రహం యావత్ దేశాన్ని ఆకర్షించే లా రూపుదిద్దుకుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక హబ్ గా మారనుందని చెప్పారు. స్వామి వారి ట్రస్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామనుజుల విగ్రహాన్నిఆవిష్కరించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి, టీఎస్ ఎస్‌డీపీఎల్ ఎండీ రఘుమారెడ్డి తదితరులు సందర్శించారు. ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరిగే కార్యక్రమలపై చినజీయర్ స్వామితో కలిసి సమీక్షించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు తరలి రానున్నందున విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా విద్యుత్ ప్రసారంలో రెప్పపాటు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోనీ యజ్ఞశాల, బోజన శాలలలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. పదిరోజుల పాటు జరగనున్న మహోత్సవం లో నిరంతరం విద్యుత్ సరఫరాను సమీక్షించేందుకు ప్రత్యేక విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. అందులో బాగంగా విద్యుత్ ప్రసారాలు నిరంతరాయంగ ఉండేలా చూడడంతో పాటు ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని సమీక్షలో పాల్గొన్న అధికారులకు సూచించారు.