హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. నగరంలోని నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్‌ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని, ఐఏఎంసీ ఏర్పాటుకు ఆయన ప్రధాన పాత్ర పోషించారన్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టుల్లో పరిష్కారం కానీ కేసులు, ఆర్బిట్రేషన్ సెంటర్లలో పరిష్కారాలు లభ్యమవుతుండటమనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ అన్నారు. అట్లాంటి సౌకర్యం భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో రావడం, రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారన్నారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, నగరానికి, మన వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందన్న నమ్మకం ఉందని కేసీఆర్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital