Friday, November 22, 2024

స్పా ముసుగులో వ్యభిచారం.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : స్పా.. సెంటర్ల ముసుగులో హైదరాబాద్‌ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది. పైన స్పా బోర్డు పెట్టుకుని లోపల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ముంబాయి, ఢిల్లి, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నిరుపేద యువతులకు మంచి జీతాలు ఇచ్చి కస్టమర్లకు సేవలు ఇచ్చేందుకు స్పా యాజమాన్యాలు అమ్మాయిలను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. వారితో మసాజ్‌లు తప్ప అన్ని పనులు చేయించుకుంటున్నాయి. యువకులను ఆకర్శించుకోవడానికి వారిని అంగట్లో బొమ్మలా తయారు చేస్తున్నాయి. స్పెషల్‌ సర్వీసుల పేరిట యువకులకు వల వేస్తూ భారీ ఎత్తున దందాను నిర్వహిస్తున్నారు. ఒక్కో సర్వీస్‌కు ఒక్కో రేట్‌ ఫిక్స్‌ చేసి స్పా సెంటర్లు యువకులను ఆకర్శిస్తున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీతో పాటు నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో వెలిసిన మెజార్టీ స్పా సెంటర్లు వ్యభిచార కేంద్రాలకు నిలయంగా మారుతున్నాయనే విమర్శలున్నాయి. మసాజ్‌ సెంటర్ల పేరిట సాగుతున్న ఈ చీకటి వ్యాపారం ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్‌ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్‌, ముంబాయి, ఢిల్లి, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నిరుపేద యువతులకు ఆశ చూపించి స్పా సెంటర్లలో పనికి కుదుర్చుకుంటున్నారు. బాడి మసాజ్‌ పేరుతో క్రాస్‌ మసాజ్‌కు పాల్పడుతూ వారితో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరు వచ్చి గత్యతంరంలేని పరిస్థితిలోఇష్టం లేకున్నా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. నగరంలోని స్పాసెంటర్లలో పనిచేస్తున్న సింహభాగం మహిళలంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం.

ఫిర్యాదులు వస్తే గాని స్పందించని పోలీసులు…

నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారాలన్ని స్థానికంగా ఉండే పోలీసులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. స్థానికంగా ఎవరి నుంచైనా ఫిర్యాదు వచ్చినప్పడు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే తప్ప పోలీసులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో స్పా సెంటర్ల ముసుగులో ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే వారికి ముట్టాల్సినవి వారికి ముడుతాయి. కొన్ని మసాజ్‌ సెంటర్లు పొలిటీషియన్లు, బడాబాబుల అండదండలతో నడుస్తున్నాయని విమర్శలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement