ఆర్టిమిస్ ప్రోగ్రామ్ కోసం మూన్ ల్యాండర్‌ను డెవలప్ చేయడానికి ప్రతిపాదనలు కోరుతూ అమెరికాలోని ప్రైవేట్ ఇండస్ట్రీలకు నాసా ఆహ్వానం పంపింది. స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ వెహికల్ ద్వారా ఆర్టిమిస్-3 మిషన్ 2025లో చంద్రుడి ఉపరితలం పైకి సిబ్బంది సహా వెళ్లే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్‌లో ఆర్టిమిస్ -3 మిషన్ మాత్రమే సిబ్బందితో ప్రయాణించే మొదటి విమానం. ఆర్టిమస్ మిషన్ ద్వారా చంద్రుడిపై రెగ్యులర్‌గా ప్రయాణించవచ్చని నాసా భావిస్తోంది.
అందుకోసం ఆస్ట్రోనాట్స్ ను చంద్రుడి ఉపరితలం పైకి చేర్చడానికి నాసాకు ఎక్కువ సంఖ్యలో వెహికల్స్ అవసరముంది. అంగారక గ్రహానికి భవిష్యత్ మార్గదర్శక సిబ్బంది మిషన్ ప్రణాళికాబద్ధమైన డ్రైరన్ కూడా ఉంది. దీనికి మూన్ ల్యాండర్ సోలార్ కక్షలో ప్రణాళికాబద్దమైన గేట్‌వేతో డాక్ చేయాల్సి ఉంటుంది. మూన్ ల్యాండర్ డెవలప్‌మెంట్ కోసం నాసా ఎంపిక చేయబోయే కాంట్రాక్టులు ఒకటి సిబ్బందితోను, ఒకటి సిబ్బంది రహితంగానూ పంపించాల్సి ఉంటుంది.
సిబ్బందితో కూడిన డెమాన్‌స్ట్రేషన్ అవసరాలను కంపెనీలు అందించగలిగిన వాటికి మాత్రే నాసా సర్టిఫై చేస్తుందని హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ మేనేజర్ లిసా వాట్సన్ మోర్గాన్ వెల్లడించారు. సొలిసిటేషన్ ప్రకారం పనులు జరిగాయని, అంతరిక్షంలో దీర్ఘకాలం ఎక్స్‌ప్లోరేషన్ కోసం పునాది ఏర్పాటు చేస్తుందని అన్నారు.