వివేకానందరెడ్డి హత్యపై విచరాణ కొనసాగుతుంది. ఈ కేసులో అనుమానం ఉన్న పలువురిని విచారిస్తున్నారు సిబిఐ. కాగా వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.. భరత్ యాదవ్. వివేకానంద రెడ్డి హత్య కు ప్రత్యేక సూత్రధారుడు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని… ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని తెలిపారు. సునీల్ యాదవ్ నేరుగా భరత్ యాదవ్ తోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు చెప్పినట్లు భరత్ యాదవ్ తెలిపారు. వివేకానంద రెడ్డి సన్నిహితురాలు షమీంకు ఆస్తి వెళుతుందని ఉద్దేశంతోనే వివేకానంద రెడ్డి హత్య జరిగినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణ భయంతోనే గతంలో ఈ వివరాలు బయటికి చెప్పలేకపోయానని… తనకు ప్రాణ హాని ఉందంటూ భరత్ యాదవ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..