ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబకు ఊరట లభించింది. మావోలతో లింకు ఉన్న కేసులో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఆ కేసులో ప్రొఫెసర్ సాయిబాబను నిర్ధోషిగా తేల్చింది. తక్షణమే ఆయన్ను జైలు నుంచి రిలీజ్ చేయాలని కూడా ఆదేశించారు. జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సరేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.
2017లో ట్రయల్ కోర్టు సాయిబాబను దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును ప్రొఫెసర్ సాయిబాబ సవాల్ చేశారు. ప్రస్తుతం శరీరం క్షీణించడం వల్ల అతను వీల్‌చైర్‌పై ఉంటున్నాడు. నాగపూర్‌లోని సెంట్రల్ జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు. ఇదే కేసుతో లింకు ఉన్న మరో అయిదుగురిని కూడా నిర్ధోషులుగా ప్రకటించారు. ఓ వ్యక్తి మాత్రం కేసు విచారణ సమయంలో ప్రాణాలు కోల్పోయారు.