Saturday, November 23, 2024

అమరరాజాకు విద్యుత్ సరఫరా!

ఏపీ హైకోర్టు ఆదేశాలతో అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది ప్రభుత్వం. దీంతో పరిశ్రమల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది. నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇటీవల అమరరాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 1న కరకంబాడితోపాటు చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లి వద్ద ఉన్న అమరరాజా పరిశ్రమలకు ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది.

దీనిపై సంస్థ యజమానులైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను ఇచ్చింది. నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement