Friday, November 22, 2024

నిర్మాత ఇబ్బందులు తెలుసుకుని – రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న అమితాబ్

జుండ్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ కార‌ణంగా నిర్మాత‌లు ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ తెలుసుకున్నార‌ట‌. దాంతో త‌నకి ఇచ్చే పారితోషికాన్ని త‌గ్గించుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ చిత్రంలో అమితాబ్ ఫుట్ బాల్ కోచ్ గా అభిమానులను అలరించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ తన పారితోషికాన్ని తగ్గించుకుని పెద్ద మనసు చూపారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు. నచ్చిన సినిమా కావడంతో నిర్మాతల కష్టాలను గుర్తించిన అమితాబ్ ఆ ఆఫర్ ఇచ్చారు.నాపై ఖర్చు చేసే బదులు దానిని సినిమా నిర్మాణంపై వెచ్చించండి’’ అని అమితాబ్ అన్నట్టు సందీప్ సింగ్ తెలిపారు. అది చూసి అమితాబ్ సిబ్బంది కూడా తమకు తక్కువ మొత్తం చెల్లిస్తే చాలని చెప్పడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. టీ సిరీస్ సంస్థ జుండ్ నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు అంగీకరించడంతో మొత్తానికి ఈ సినిమా కష్టాలకు చెక్ పడింది. ఈ నెల 4న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement