Tuesday, November 26, 2024

నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ లైవ్ ప్రొసీడింగ్స్‌ను తొలుత యూట్యూబ్‌లో ప్రసారం చేయనున్నారు. రానున్న రోజుల్లో సుప్రీం సొంత వేదిక ద్వారానే విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సుప్రీంకోర్టులో కేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్‌కు అనుకూలంగా 2018లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల వరకే లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. త్వరలోనే అన్ని ధర్మాసనాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి సుప్రీం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం విధితమే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement