గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు పలికింది. ఉక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలియజేసే ఒక వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీపై పోస్ట్ చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో సబ్ వే స్టేషన్లు, బంకర్లలో తలదాచుకోవడం అందులో కనిపిస్తుంది. ఉక్రెయిన్ లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అమాయక ప్రజలు తమతోపాటు, తమ వారి ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఈ తరహా విపత్కర పరిస్థితులను ఊహించలేం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనకు దారితీసే పరిస్థితి ఇది. యుద్ధం జరుగుతున్న చోట అమాయక ప్రజలున్నారు. వారు మీలాంటి వారు, నాలాంటి వారే. ఉక్రెయిన్ ప్రజలకు ఎలా సాయపడాలో తెలియజేసే మరింత సమాచారాన్ని తెలియజేసే నా బయో లింక్ ఇదే’’ అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనుకునే వారు యునిసెఫ్ కు విరాళం ఇవ్వాలని తెలిపారు.
ఉక్రెయిన్ ప్రజలకు గ్లోబల్ స్టార్ మద్దతు – వారు మనలాంటి వారే – ప్రియాంకచోప్రా
Advertisement
తాజా వార్తలు
Advertisement