ప్రియాంక గాంధీని కాంగ్రెస్ చీఫ్‌గా నియమించాలన్న డిమాండ్ వస్తోంది. ఈ మధ్య మూడు రోజులపాటు జరిగిన పార్టీ చింతన్ శివిర్ కార్యక్రమంలోనూ చాలామంది లీడర్లు ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వారం ‘చింతన్ శివిర్’ అనే మూడు రోజుల మేధోమథన సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. కాగా, శనివారం పార్టీ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ వాద్రా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకురాలు. ఆమె అచ్చు నానమ్మ ఇందిరా గాంధీని పోలీ ఉంటారు కాబట్టి ఆమెను పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని అన్నారు. రెండేళ్లుగా రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఆయన సిద్ధంగా లేకుంటే ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలి’ అని చాలా మంది నుంచి అభిప్రాయాలు వచ్చినట్టు పలువురు లీడర్లు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement