Friday, September 27, 2024

ప్రైవేట్ దోపిడీ…’కాసు’పత్రులు

కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయి ఒళ్లు గుల్లవుతుంటే వైద్యం ముసుగులో ప్రయివేట్ ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇంటిని గుల్లచేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ అయితే ఫీజు కట్టేంతవరకు మృతదేహాలను అప్పగించకపోవడం వంటివి కూడా చేస్తున్న ఘటనలు బయటపడ్డాయి. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కొన్ని ఆస్పత్రులు మాత్రం ఇదే అదునుగా దోచేస్తున్నాయి. కరోనా వైరస్‌ బాధితులు ఆసుపత్రుల్లో ఉన్న రోజులను బట్టి ఫీజులు గుంజుతున్నాయి. కరోనా వ్యాధి కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులే బాధితులను భయపెడుతున్నాయి. వైరస్‌ సోకితే ఆసుపత్రికి వెళితే నయం చేస్తారేమో కానీ ఫీజుల రూపంలో రోగులను, వారి బంధువులను మానసికంగా చంపేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు కనీసం రోగుల పట్ల మానవత్వం ప్రదర్శించకుండా కనికరం లేకుండా రూ.లక్షల్లోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. 

హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ బాధితుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది. కోవిడ్ తో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బిల్లు చెల్లిస్తేనే అప్పగిస్తాం అంటూ బంధువులకు స్పష్టం చేసింది. అంతేకాదు గత మూడు రోజులుగా మృతదేహాన్ని సెల్లార్ లో ఉంచింది ఆసుపత్రి యాజమాన్యం. ఈ నెల 17న కరోనా లక్షణాలతో బాధితుడిని బంధువులు సుప్రజ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ సందర్భంగా లక్షన్నర ఫీజు వసూలు చేశారు. అయితే, చికిత్చ పొందుతూ ఈ నెల 25న బాధితుడు మృతి చెందాడు. అయితే, బిల్లులోని మిగత రూ.6 లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement