Saturday, November 23, 2024

ప్రైవేటులో ఫీజులుం…

ఫీజులు కట్టలేక పిల్లలను ట్యూషన్లకు పంపిస్తున్న వైనం
సర్కారు బడుల్లో విద్యార్థులకు కరోనా భయం
కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్న స్కూల్స్‌
బడులకు పంపేందుకు ఉత్సుకత చూపని పేరెంట్స్‌
పై తరగతులకు ప్రవెూట్‌ చేయాలంటున్న తల్లిదండ్రులు

హైదరాబాద్ : ఒకవైపు ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజుల భారం.. మరోవైపు సర్కారు బడుల్లో కరోనా భయం విద్యార్థుల తల్లిదండ్రు లను వెంటాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు నిర్దేశించిన ఫీజులు పేరెంట్స్‌ కట్టలేకపోతుంటే, మరికొన్ని చోట్ల సర్కారు బడుల్లొ నేమో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం వారిని మరింత కలవరపాటుకి గురిచేస్తోంది. వెరసి తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతు న్నారు. విద్యా సంవత్సరం నడిచే ఈ రెండు మూడు నెలలకు మొత్తం ఏడాది ఫీజు కట్టి స్కూళ్లకు పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఇష్టంగా లేరు. దాదాపు 50 నుంచి 60 శాతం మంది పేరెంట్స్‌ కేవలం అధిక ఫీజుల కారణంగానే పిల్లలను స్కూల్స్‌కు పంపించడంలేదు. ఈ విద్యా సంవత్సరానికి కేవలం రెండు మూడు నెలల బోధనకు అప్పు సప్పు చేసి వేలకు వేలు ఫీజులు వాళ్లకు ముట్టజెప్పడం కంటే పిల్లలను ఇంటి వద్దనే ఉంచి టీవీల్లో వచ్చే ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు ట్యూషన్లకు పంపించి చదివిస్తే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నా రు. ఈ క్రమంలోనే ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 31 శాతం కంటే దాటడం లేదని తెలుస్తోంది. ఫీజులు, కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులను పై తరగుతులకు ప్రమోట్‌ చేయాలనే డిమాండ్‌ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది.
కరోనా హాట్‌స్పాట్‌లుగా పాఠశాలలు…
పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు ఎవ్వరూ కరోనా బారిన పడకుండా ఉం డేం దుకు ప్రభు త్వం ముందస్తు చర్యలను పకడ్బం దీగా చేపట్టింది. తరగతి గదికి 20 మంది, బెంచికి ఒక విద్యార్థి మాత్రమే, మా స్కులు తప్పనిసరి, నిత్యం తరగతి గదులను శానిటైజేషన్‌ చేయించడం, షిఫ్ట్‌ల వారిగా తరగతి బోధన, తదితర లాంటి ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రారంభంలో ఎక్కడా కూడా కరోనా కేసులు నమోదు కాలేదు. ఈ మధ్య గత కొన్ని రోజులుగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల్లల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడం అటు అధి కారులను ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో మొదట 12 కరోనా కేసులు, ఆ తరువాత మరో 7 పాజిటివ్‌ కేసులు నమోద వడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అలాగే కరీంనగర్‌ జిల్లా జమ్మి కుంట పట్ట ణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యా ర్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
జలుబుతో బాధపడు తున్న విద్యార్థికి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు భయాందోళ నకు గురయ్యారు. రెండు రోజుల క్రితం కోరుట్ల మండలం అయిలాపూర్‌ గ్రామ ంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే ప్రైవేట్‌ స్కూళ్లలోనూ అక్కడక్కడ కొంత మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలిసింది. తరగతి గదిలో ఒక్కరికి సోకినా మిగతా విద్యార్థులందరూ భయాందోళనకు గురవుతున్నారు. అలాగే గ్రామంలో కరోనా కేసులు నమోదైనా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెంది తమ పిల్లలను బడులకు పంపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈనెల 3వ తేదీన విద్యార్థుల హాజరు శాతం ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వ, లోకల్‌ బాడీ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల హాజరు శాతం 41 మాత్రమే. మోడల్‌ స్కూళ్లల్లో 40 శాతం, కేజీబీవీల్లో 12 శాతం, గురుకులాల్లో 6 శాతం, ప్రైవేట్‌ స్కూళ్లల్లో కేవలం 31 శాతం. సగటున రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ బడుల్లో నమోదైన విద్యార్థుల హాజరుశాతం 34 మాత్రమే. మొత్తానికి రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకవైపు ఫీజుల భారం, మరోవైపు కరోనా భయం తీవ్రంగా వెంటాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement