తీహార్ జైలుకి కరుడు గట్టిన నేరస్తులను పంపుతారన్న సంగతి తెలిసిందే. కాగా ఒకటో నెంబర్ గదిలో ఓ ఖైదీ మొబైల్ ని మింగేశాడు. మొబైల్ ఫోన్, ఇతర అంశాలపై అనుమానంతో ఖైదీలను సోదా చేస్తుండగా భయంతో ఓ ఖైదీ సెల్ మిగడం విశేషం. దాంతో అతడిని ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. ఆ ఖైదీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే మొబైల్ మాత్రం అతని కడుపులోనే ఉంది. జనవరి 5వ తేదీన ఈ ఘటన జరిగింది. ఓ ఖైదీ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో జైలు అధికారులకు అతడిపై అనుమానం వచ్చింది.
దీంతో ఆ ఖైదీని సోదా చేయడానికి అధికారులు వచ్చారు. వెంటనే భయంతో ఆ ఖైదీ మొబైల్ ఫోన్‌ను మింగేశాడని జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత ఖైదీ ద్వారానే విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌కు ఆ ఖైదీని తీసుకువెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నదని, కానీ, మొబైల్ ఫోన్ మాత్రం ఇంకా ఆయన పొట్టలోనే ఉన్నదని ఆ అధికారి వెల్లడించారు. కానీ, ఆయన దగ్గరకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..