తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే యువతకు పెద్దపీట వేస్తామన్నారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. తెలంగాణ అమరుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, కౌలు రైతులకు అయిదు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేసి, ఎకరాకు 5వేలు ఇస్తామన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సరూర్నగర్లో ఇవ్వాల (ఆదివారం) తెలంగాణ భరోసా బహిరంగ సభ జరుగుతోంది. అదేవిధంగా అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు ప్రతినెలా 4వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా యూత్ డిక్లరేషన్ని రిలీజ్ చేశారు మాయావతి.
Breaking | అమరుల కుటుంబాలకు, యువతకు ప్రాధాన్యం.. ఉద్యోగ భృతి కల్పిస్తాం: మాయావతి
Advertisement
తాజా వార్తలు
Advertisement