Friday, November 22, 2024

శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత – వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

సామాన్య భ‌క్తుల‌కు ఊర‌ట‌నిచ్చేలా ప్ర‌క‌ట‌న చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత లభించేలా శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రోజుల్లో వీఐపీలకు కేటాయించిన సమయాన్ని కూడా సామాన్యులకు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది. అంతకాదు శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 30 వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement