ఓ మహిళ ఉపాధ్యాయురాలిపై చెప్పుతో దాడి చేశాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. దాంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సస్పెండ్ చేసి.. ఇంటికి పంపించారు. ఈ ఘటన లఖింపూర్‌లోని సదర్ బ్లాక్‌లో ఉన్న మహంగుఖేడా ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయుల తీరుపై శిక్షామిత్ర సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లఖింపూర్ ఖేరీ లోని మహేంగు ఖేరా అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో సీమ అనే మహిళ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. అయితే.. పాఠశాలకు ఆ మహిళ టీచర్ ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ప్రిన్సిపల్.. అందరి ముందే ఆమెపై రెచ్చిపోయాడు. ఇష్టానూసారంగా బూతులు తిట్టాడు. ఆమె ఆ ప్రిన్సిపల్ ను తిట్టింది. సహనం కోల్పోయిన ఆ ప్రిన్సిపాల్ ..తన బూటు తీసుకుని ఆ మహిళ టీచర్ పై దాడి చేశాడు. ఇష్టమోచ్చినట్లు కొట్టాడు.
అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత.. ఉపాధ్యాయురాలు కూడా ప్రిన్సిపల్ ను కొట్టింది. మరో ఉపాధ్యాయుడు వారిని అడ్డుకోవడంతో ఆ దాడి అంతటితో ఆగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్.. అజిత్ వర్మను సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి (బిఎస్‌ఎ) లక్ష్మీకాంత్ పాండే తెలిపారు. అయితే.. ఈ ఘటనపై ఆ ప్రిన్సిపల్ వాదన మరోలా ఉంది. సదరు ఉపాధ్యాయురాలు రోజు కావాలనే ఆలస్యంగా వస్తుందని, మొదట ఆమెను తనపై చేయి చేసుకుందని వివరణ ఇచ్చాడు. మరోవైపు.. ఈ ఘటనపై ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ట్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే ఇక ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటో.