రాజకుటుంబ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ ఓ ఉద్యోగంలో చేరాడు. రాచరికానికి గుడ్‌బై చెప్పి బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అమెరికా వచ్చేసిన ప్రిన్స్ హ్యారీ జంట.. ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రిన్స్ హ్యారీ ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఓ స్టార్టప్ కంపెనీలో చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్‌గా చేరాడు. ఉద్యోగులను మానసికంగా సిద్దం చేయడమే ప్రిన్స్ హ్యారీ చేయాల్సిన జాబ్. ఈ కంపెనీ పేరు బెటరప్. మానసికంగా దృఢంగా ఉండటం అనేది చాలా ముఖ్యమని, ఇది మనలోని అంతులేని సామర్థ్యాన్ని వెలికి తీస్తుందని ఈ సందర్భంగా కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో ప్రిన్స్ హ్యారీ చెప్పాడు.
.