ప్రధాని మోడీ నోటి వెంట ఏపీ మార్కాపురంకి చెందిన రాం భూపాల్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. విషయం ఏంటంటే మోడీ తాజాగా మన్ కీ బాత్ నిర్వహించారు. సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుతూ మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగిని గుర్తు చేసుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన ఆదాయం మొత్తాన్ని బాలికల విద్య కోసం ఆ మిత్రుడు ఖర్చు పెట్టారని తెలిసిందన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గర్వించదగిన విషయమన్నారు. ఇప్పటి వరకు వంద మందికి సుకన్య సమృద్ధి యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు తెరచి వారి పేరిట రూ.25 లక్షలకుపైగా జమ చేశారని మోడీ ప్రశంసించారు. స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయడం మన సంస్కృతిలో అంతర్భాగమన్న విషయాన్ని ఆయన నిరూపించారన్నారు. మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ యూనికార్న్ ల(వంద కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు)కుపైన ఆదాయం ఉండే స్టార్టప్ లు)అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీ నాటికి దేశంలో యూనికార్న్ ల సంఖ్య 100కు చేరిందన్నారు. వాటి విలువ 35 వేల కోట్ల డాలర్లని (రూ.25 లక్షల కోట్లకుపైగానే) చెప్పారు. గత ఏడాదే 44 యూనికార్న్ లు కొత్తగా వెలిశాయని వెల్లడించారు.
మన్ కీ బాత్ లో – ఏపీ మార్కాపురం వ్యక్తి పేరు ప్రస్తావించిన ప్రధాని
Advertisement
తాజా వార్తలు
Advertisement