మన్‌కీబాత్ ప్రసంగంలో ప్రధాని మోడీ, సికిందరాబాద్‌లోని బన్సీలాల్‌పేట మెట్లబావి పునరుద్ధరణ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన పనుల గురించి పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ చేపట్టిన చారిత్రాత్మకమైన బన్సీలాల్‌పేట మెట్లబావిని విజయవంతంగా పునరుద్ధరించినందుకు అభినందనలు తెలిపారు. క్లీనింగ్ ప్రక్రియలో భాగంగా సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను బావినుంచి తొలగించారు. పునరుద్ధరణ ప్రక్రియలో భూగర్భ జలాలను రీచార్జ్ చేసే పద్ధతులనూ ఏర్పాటుచేశారు. నగరం చుట్టుపక్కుల ఉన్న మొత్తం 140 మెట్ల బావులను పునరుద్ధరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సన్నాహాలు చేపట్టింది. గుడిమల్కాపూర్ సమీపంలోని భగవాన్‌దాస్ బాగ్ బావోలి, శివబాగ్ బావోలితో సహా కొన్ని బావులు ఇప్పటికే పునరుద్ధరించబడ్డాయి.
126 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద..
ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన 126 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ఇటీవల పద్మ అవార్డుల వేడుకలో మీరు బాబా శివానంద్ జీని గమనించి ఉంటారు. ఆయనకు 126 ఏళ్లు. బాబా శివానంద్‌తోపాటు ఆయన ఫిట్నెస్ కూడా నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఆయన చురుకుదనం చూసి నేను షాక్‌కు గురయ్యాను. మేము ఎదురుపడ్డప్పుడు స్వామి శివానంద నంది ముద్రలో నమస్కరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన దీర్ఘాయుష్సు పొందాలని కోరుకుంటున్నాను అని ప్రధాని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...