ట్రక్కు ట్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను చుట్టుముట్టారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విధించిన కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ Freedom Convoy పేరుతో ట్రక్కు డ్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను చుట్టుముట్టారు. ఒట్టావాలో వేలాది మంది ట్రక్కర్లు గుమిగూడి US సరిహద్దును దాటడానికి వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒట్టావాలోని పార్లమెంట్ హిల్స్ వైపుకు వేలాది మంది నిరసనకారులు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులను అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టుగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టే ప్రమాదం ఉండంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆందోళన విషయానికి వస్తే కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని కోరుతూ రాజధాని నగరంలోకి దూసుకొచ్చిన ట్రక్కర్లకు వేలాది మంది నుంచి మద్దతు లభించింది.
నిరసనకారుల్లో వృద్దులు, పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది నిరసనకారులు ప్రముఖ యుద్ధ స్మారక చిహ్నంపై నృత్యం చేయడం కనిపించింది. జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని అపవిత్రం చేయడం చూసి నేను బాధపడ్డాను. కెనడియన్లు తర తరాలుగా స్వేచ్ఛా , వాక్చాతుర్యం వంటి మన హక్కుల కోసం పోరాడారు, చనిపోయారు.. కానీ ఇందుకోసం కాదు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారు సిగ్గుతో తలలు దించుకోవాలి’ అని జనరల్ వేన్ ఐర్ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మనం చూస్తున్న ప్రవర్తన ఖండించదగినది’ అని అనితా ఆనంద్ పేర్కొన్నారు. కెనడా కోసం పోరాడి మరణించిన వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఈ చర్యలను కెనడా సైనికాధికారి జనరల్ వేన్ ఐర్, కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ఖండించారు. తీవ్రమైన శీతల వాతావరణ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా వందలాది మంది నిరసనకారులు పార్లమెంటరీ ఆవరణలోకి రావడంతో.. ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..