Tuesday, November 26, 2024

ప్ర‌ధాని మోడీ నోట – పెద్దాపురం మ‌రిడ‌మ్మ జాత‌ర ప్ర‌స్తావం

తూర్పుగోదావ‌రి జిల్లాలోని పెద్దాపురంలో ఉన్న మ‌రిడ‌మ్మ ఆల‌యం గురించి మాట్లాడారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. మ‌న్ కీ బాత్
రేడియో కార్యక్రమం ద్వారా తన మనోభావాలను మరోమారు దేశప్రజలతో పంచుకున్నారు. మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో గిరిజన సమాజానికి చెందిన అనేకరకాలైన సంప్రదాయక జాతరలు జరుగుతాయన్నారు. ఇందులో కొన్ని జాతరలు గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్నాయని … మరికొన్ని జాతరలు గిరిజనుల చరిత్ర, వారసత్వంతో ముడిపడి ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరిడమ్మ జాతర కూడా ఆదివాసీ సమాజానికి చెందిన ఆచారాలతో ముడిపడిన పెద్ద జాతర అని మోడీ వెల్లడించారు. ఈ జాతర జ్యేష్ఠ అమావాస్య నుంచి ఆషాఢ అమావాస్య వరకు జరుగుతుందని వివరించారు. ఇక్కడి గిరిజన సమాజం ఈ జాతరను శక్తి ఉపాసనతో ముడిపెడతారని. మేడారం సమ్మక్క-సారక్క జాతర కూడా ఇలాంటిదేనని అన్నారు. జాతరలకు ఎంతో సాంస్కృతిక మహత్మ్యం ఉందని, జాతరలు ప్రజల మనసులను కలుపుతాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement