Wednesday, November 20, 2024

వచ్చే 25 ఏళ్లలో భారత్ ప్రబల శక్తిగా ఎదగాలి: ప్రధాని మోదీ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. భారత్‌కు వచ్చే 25 ఏళ్ల కాలం అమృత ఘడియలు అని చెప్పారు. ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలన్నారు. అయితే కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదని, నిరంతర శ్రమ, పట్టుదల కావాలన్నారు. పౌరులందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుందన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూళ్లలో ఇక నుంచి అమ్మాయిలకు సైతం ప్రవేశం కల్పించనున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయరంగంలో కొత్త సంస్కరణలు కావాలన్నారు ప్రధాని. రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లానీరు వచ్చేలా చూస్తామన్నారు. అలాగే, రేషన్ షాపుల్లో పోషకాహార ధాన్యాలు అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రధాని పేర్కొన్నారు.

కాగా దేశ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో క్రీడాకారులను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారని, వారు కేవలం పతకాలు మాత్రమే సాధించలేదని, నవయువతకు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు. ఒలింపిక్స్‌ విజేతలు మనకు స్ఫూర్తి అన్నారు. ఒలింపిక్‌ పతక విజేతలను చప్పట్లు కొట్టి ప్రత్యేకంగా అభినందించారు. అటు కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అని ప్రధాని కొనియాడారు.

ఈ వార్త కూడా చదవండి: ప్రధానిగా 8వ సారి ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగురవేసిన మోదీ

Advertisement

తాజా వార్తలు

Advertisement