ప్రధాని నరేంద్ర మోడీకి , రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. ఈ మేరకు భద్రత వైఫల్యం గురించి ఆరా తీశారు. ఈ మేరకు మోడీని , రాష్ట్రపతి కలిసే అవకాశం ఉంది. నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోడీకి పంజాబ్ ప్రభుత్వం సరిగా భద్రతను కల్పించకలేకపోవడం రాజకీయచర్చకి తావిచ్చింది. ఈ అంశంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రధాన మంత్రి కాన్వాయ్ దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. మరోవైపు పంజాబ్ ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.పంజాబ్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాధ్యత వహించి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. “ఇలా మళ్లీ జరగకుండా చూసుకోవాలి” అని పిటిషనర్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..