న్యూ ఢిల్లీ : మోడీ సర్కార్ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన స్కీమ్ కింద నేటి నుంచి రూ.2వేలు రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి జమకానున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద వంద మిలియన్ల రైతులకి రూ. 20వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతులకు 10వ విడత ఆర్థిక సహాయంగా 20వేల 900కోట్లను ప్రధాని నేడు విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద, అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం ఈ పథకం ద్వారా అందించబడుతుంది. కాగా రూ. 2,000 మూడు సమాన వాయిదాలలో చెల్లించబడుతుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో మోడీ లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. పీఎం కిసాన్ 9వ విడత కింద ఆగస్టు 2021న నగదు విడుదలయింది. కాగా నేడు విడుదల చేసింది 10వ విడతగా నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, 2022 నూతన సంవత్సరం మొదటి రోజున, దాదాపు 10.09 కోట్ల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 20,900 కోట్లు బదిలీ చేయబడుతున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పీఎం-కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..