Monday, November 18, 2024

8న మోడీ రాక.. పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించిన బీజేపీ నేతలు

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్-తిరుపతి వరకు నడిచే రెండో వందే భారత్ రైలును అదే రోజున మోడీ ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13వ రైలు కావడం విశేషం. ఈ రైలు వల్ల సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8.30 గంటల వరకు తగ్గనుంది.

ఆనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement