Friday, November 22, 2024

Breaking: అగ్నిపథ్​ నేపథ్యం.. రేపు త్రివిధ దళాధిపతులను ప్రధాని మోదీ భేటీ!

అగ్నిపథ్ పథకంపై కొనసాగుతున్న వివాదం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ రేపు జూన్ 21న ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానిని కలవనున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ముందుగా ప్రధాని మోదీని కలుస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. కొత్త సైనిక పథకం కింద అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించేందుకు మూడు సర్వీసులు ఇప్పటికే నోటిఫికేషన్‌లు కూడా జారీ చేశాయి.

ఆర్మీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తుదారుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్ ప్రత్యేక ర్యాంక్‌ను ఏర్పరుస్తారని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌ల కంటే భిన్నంగా ఉంటుందని సైన్యం తెలిపింది. 4 సంవత్సరాల సేవా వ్యవధిలో పొందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా కూడా వారికి నిషేధం ఉంటుంది.

ఇక.. మూడు సర్వీసుల అధికారులు ఆదివారం కొత్త పాలసీ కింద అగ్నివీరుల నమోదుకు సంబంధించిన విస్తృత షెడ్యూల్‌ను అందించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అగ్నిపథ్ పథకం కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లలో భారతదేశం అంతటా నిర్వహించనున్నారు. 25వేల మంది సిబ్బందితో కూడిన మొదటి బ్యాచ్ డిసెంబర్ మొదటి, రెండో వారంలో శిక్షణా కార్యక్రమంలో చేరుతుందని లెఫ్టినెంట్ జనరల్ పొనప్ప తెలిపారు.

- Advertisement -

కాగా, 40వేల మంది సిబ్బందిని ఎంపిక చేసేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 83 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించాలని ఆర్మీ యోచిస్తోంది. సైనిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్​పురి మాట్లాడుతూ.. కాల్పులు, హింసకు పాల్పడిన యువకులు ఎవరినైనా తీసుకోవడానికిక ముందు పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి వారు మూడు సర్వీసుల్లో చేరే అవకాశం లేకుండా పోతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement