నో మనీ ఫర్ టెర్రర్ గ్లోబల్ మీట్ ని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 18న ప్రారంభించనున్నారు. ఢిల్లీలో నో మనీ ఫర్ టెర్రర్’ గ్లోబల్ మీట్ జరగనుంది. రెండు రోజులు జరిగే ఈ సమావేశంలో మొత్తం నాలుగు సెషన్లు ఉండనున్నాయి ..ఈ సమావేశంలో తీవ్రవాదం నుంచి సమాజాన్ని రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకాలపాల కోసం ఫండ్స్ అందుతున్న చర్యలను అడ్డుకోవడం, ప్రతిస్పందనలు ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మోడీ శుక్రవారం జాతీయ రాజధాని ఢిల్లీలో మూడవ ప్రపంచ నో మనీ ఫర్ టెర్రర్’ (NMFT) సదస్సును ప్రారంభించనున్నారు. ఇందులో 75 దేశాల ప్రతినిధులు ఉగ్రవాదం, ఉగ్రవాద ఫైనాన్సింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని అభివృద్ధి సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్‌పై అంతర్జాతీయ సదస్సులు ఇదివరకు 2018, 2019లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సమావేశాలు జరిగాయి. ఆయా సమావేశాల్లో ఉగ్రవాదం అరికట్టడం, దీనికి అందుతున్న ఫండ్స్ ను అడ్డుకోవడం వంటి చర్యల గురించి చర్చించారు. ఉగ్రవాదం, ఉగ్రవాద ఫైనాన్సింగ్‌లో ప్రపంచ పోకడలను చర్చించడానికి భారతదేశం నవంబర్ 18-19 తేదీలలో తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఈ గ్లోబల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. టెర్రరిజం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, తీవ్రవాద ఫైనాన్సింగ్ కోసం అధికారిక – అనధికారిక నిధులను ఉపయోగించడం, తీవ్రవాద ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడంలో సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని ఓ అధికారి వెల్లడించారు. శనివారం జరిగే సదస్సు ముగింపు సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. NMFT కాన్ఫరెన్స్ కోసం సిద్ధం చేసిన ఎజెండా ప్రకారం.. రెండు రోజుల పాటు నాలుగు సెషన్‌లు జరుగుతాయి. ఇందులో 75 దేశాలకు చెందిన ప్రతినిధులు ఉగ్రవాద సంబంధిత అంశాలపై చర్చిస్తారు.