ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే మార్చి 11న ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన గుజరాత్ లో పర్యటించనున్నారు. కాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. పంజాబ్ లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు జనాలు పట్టం కట్టబోతున్నారని తేలింది. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి గమనార్హం. శుక్రవారం నాడు ఒక భారీ ర్యాలీలో మోడీ ప్రసంగించనున్నారు. అంతేకాదు మూడు రోజుల ఆరెస్సెస్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. 2017లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పెద్ద ఎత్తున పోటీ ఎదురైంది. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఆరో సారి గెలిచినప్పటికీ అనుకున్న మెజార్టీని సాధించలేకపోయింది. 182 సీట్లు ఉన్న అసెంబ్లీలో 150 సీట్లను గెలవాలనే టార్గెట్ ను అమిత్ షా నిర్ణయించినప్పటికీ… బీజేపీ కేవలం 99 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో పుంజుకుని 77 సీట్లను కైవసం చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement