తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు ప్రధానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కాసేపట్లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ పటిష్టం చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు.
- Advertisement -