ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా దాదాపు రూ.1,132 కోట్లు ఆదా చేసింది. జలౌన్ జిల్లాలోని కైథేరి గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫిబ్రవరి 29, 2020లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే ఈ హైవేను నిర్మించారు. చిత్రకూట్ జిల్లాలోని గోండా గ్రామం వద్ద ఎన్‌హెచ్-35తో ఈ హైవే కలుస్తుంది. ఆ తర్వాత ఇటావా జిల్లాలోని కుద్రాలి గ్రామం వరకు ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. అక్కడ ఆగ్ర-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తుంది. తొలుత దీన్ని ఫోర్‌లేన్ రూట్‌గా నిర్మించారు. తర్వాత సిక్స్ లేన్స్‌గా మార్చే అవకాశముంది.