ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్‌ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఇవ్వాల (సోమవారం) కొత్త కాయిన్స్‌ని రిలీజ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోడీ, అంధులు కూడా సులభంగా గుర్తించేలా కొత్త నాణేలను రూపొందించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుడలను పురస్కరించుకొని నిర్వహిస్తోన్న ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లోగోను రూ.1, రూ.2/ రూ.5, రూ.10, రూ. 20విలువ కలిగిన కొత్త నాణేలను ముద్రించారు.
ఇవి కేవలం స్మారక నాణాలు మాత్రమే కాదని త్వరలో -చలామణిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెళ్లడించింది. ఈ కొత్త నాణేలు దేశాభివృద్ధి కోసం పనిచేసి ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోదీ వెల్లడించారు. 12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన జన సమ్మర్థ్ పోర్టల్ ను కూడా మోడీ ఈ సందర్భంగా ప్రారంభించారు. అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు.. కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అమృత్ మహోత్సవ్ సందర్భంగా విడుదల చేసిన నాణాలు అమృత్ కాలం నాటి అద్భుత ఘడియలను ప్రజలకు గుర్తుచేస్తాయన్నారు. గత 8 ఏళ్లలో దేశంలో ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలు చేసినట్టు మోదీ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ కు రోజురోజుకు బాగా ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు.