మేం వ్యాక్సిన్ కోసం ఎగబడలేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటైన అమేథిలో ఎన్నికల ప్రచారాన్ని మోడీ చేపట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నేను, మా అమ్మ వ్యాక్సిన్ తీసుకున్నాం. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఎగబడలేదు. ఆమె వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నది. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. బూస్టర్ డోసు కూడా తీసుకోలేదు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాక్సిన్ కోసం ముందు వరుసలో ఉండేవారని మోడీ విమర్శించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీని మోడీ టార్గెట్ చేసి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే వ్యాక్సిన్‌ను అమ్ముకునేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..