ప్రధాని నరేంద్రమోడీ కేరళలో పర్యటిస్తున్నారు. స్వదేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ భారతీయ నౌకాదళంలోకి చేరింది. ప్రధాని చేతుల మీదుగా ఆ యుద్ధ నౌకను జలప్రవేశం చేయించారు. ఈసందర్భంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. భారతీయ నౌకాదళ చరిత్రలో గతంలో ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయంగా తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతరులు పాల్గొన్నారు.
యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాండ్ సెర్మనీ నిర్వహించారు. 45వేల టన్నుల యుద్ధ విమానాన్ని సుమారు 20 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. విక్రాంత్ చాలా పెద్ద సైజ్‌లో ఉందని, చాలా గ్రాండ్‌గా ఉందని, చాలా విశిష్టమైందని, ఓ ప్రత్యేకమైందని ప్రధాని మోదీ అన్నారు. విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు అని, హార్డ్‌వర్క్, ట్యాలెంట్‌కు ఇది నిదర్శనమని ఆయన అన్నారు.