భారత్ లో రూ.1500కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించనున్నారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. కాగా భారత్ కు చెందిన అరుదైన 29 కళాఖండాలను (కళాకృతులు) తిరిగి ఇవ్వనున్నారు. టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ తదితర రంగాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టనుంది. ఇరు దేశాల మధ్య ఇది రెండో వర్చువల్ ద్వైపాక్షిక సమావేశం కానుంది. 2020 జూన్ 4న తొలి సమావేశం జరిగింది. ‘‘ప్రధాని మోడీతో వాణిజ్యం, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించనున్నాం. ఇరు దేశాల పరస్పర ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించనున్నాం’’ అంటూ ఈ సమావేశానికి ముందు స్కాట్ మారిసన్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..