Saturday, November 23, 2024

కెన‌డాలో ఎమ‌ర్జెన్సీ – త‌ప్పుపడుతోన్న ప్ర‌తిప‌క్షాలు

కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ని త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని ట్ర‌క్క్ డ్రైవ‌ర్లు, వ‌ల‌స‌దారులు తీవ్రంగ వ్య‌తిరేకిస్తోన్న వారికి ప్ర‌జ‌లు కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. నేప‌థ్యంలో దేశంలో ఎమర్జెన్సీని విధిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి విషమించడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబం రహస్య ప్రదేశంలోకి కూడా వెళ్లిపోయారు. ట్రక్కు డ్రైవర్లు రాజధాని ఒట్టోవాను ముట్టడించడంతో పరిస్థితి విషమించింది.. ఈ నేపథ్యంలో దేశంలో ఎమర్జెన్సీని విధించాలని ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, 30 రోజుల పాటు అమలులో వుంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట వ్యతిరేకమైన, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.దాదాపు 50 ఏళ్ల క్రితం (1970 లో) ఇప్పటి ప్రధాని ట్రూడో తండ్రి పియర్రె ట్రూడో ఎమర్జెన్సీ విధించారు. అయితే ప్రధాని ట్రూడో తీసుకున్న ఈ నిర్ణయానికి పార్లమెంట్ కచ్చితంగా ఆమోదించాల్సి వుంటుంది. కాగా దేశంలో ఎమర్జెన్సీని విధించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement