Thursday, November 21, 2024

ముచ్చ‌ట‌గా మూడోసారి నేనే ప్ర‌ధానిని – మోడీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా తాను ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధానిని అవుతాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. తనకు విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధాని పదవి చేపడితే అంతా అయి పోయినట్లు కాదన్నారు. ఈ సందర్భంగా ఓ విపక్ష నాయకుడి మాటలను గుర్తు చేసుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు.. వితంతువులు ..పేద ప్రజలతో మోడీ వర్చువల్గా ముచ్చటించారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు(శరద్ పవార్) నన్ను కలిశారు. రాజకీయంగా నన్ను ఆయన తరచుగా విమర్శిస్తుంటారు. కానీ నేను ఆయనను గౌరవిస్తాను. అప్పుడు ఆయన.. మోడీజీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారని అడిగారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ సాధించినట్టేనని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. కానీ మోడీ అందరికంటే చాలా భిన్నమని ఆయనకు తెలీదు మ‌రి.

మోడీ గుజరాత్ గడ్డ మీద పెరిగారు. అందుకే నేను దేన్నీ అంత తేలికగా తీసుకోను. విశ్రాంతి తీసుకోవాలని అనుకోను. సంక్షేమ పథకాలను వంద శాతం మంది లబ్ధిదారులకు అందేలా చూడటమే నా కల. అందుకే వచ్చే సారికూడా ప్రధాని పదవిలో నేనే ఉంటే తప్పేముంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. ఇక దీనిని బట్టి.. ప్రధాని పీఠంపై జరుగుతున్న చర్చకు నరేంద్ర మోడీ ఇలా చెక్ పెట్టార‌నిపిస్తోంది. సహజంగా.. ఆర్ ఎస్ ఎస్ వాది అయిన.. మోడీ.. ఆ సిద్ధాంతాల ప్రకారం ఏ పదవినైనా రెండు సార్లకు మించి తీసుకునే అవకాశం లేదు. మ‌రి ఇప్పుడు మోడీ ఆ సిద్ధాంతాల‌ను గాలికి వ‌దిలేశారా అని ప‌లువురు గుస గుస‌లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement