Tuesday, November 19, 2024

కొండెక్కిన బాయిలర్ కోడి.. కిలో రూ.280కి చేరిన చికెన్‌ ధర!

తెలుగు రాష్ట్రాల్లో బాయిలర్‌ కోడి కొండెక్కింది. మంసం ప్రియుకులకు చికెన్‌ రేటు చుక్కు చూపిస్తోంది. ప్రస్తుతం చికెన్‌ కిలో రూ.280 వరకూ అమ్ముతున్నారు. ఇప్పటికే వంట నూనెలు, పెట్రోల్‌, గ్యాస్‌ తదితర నిత్య వసరవస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా బాయిలర్‌ కోడి ధర కూడా ఆకాశానికి అంటాయి. దాదాపు 4 నెలలుగా కోడిగుడ్డు ధరలు నిలకడగా ఉండగా, చికెన్‌ రేటు కిలో రూ.140- రూ.180 మధ్యే ఉంది. కానీ ఇప్పుడు బాయిలర్‌ కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధర పెరుగుతోంది. రెండు నెలల క్రితం బాయిలర్‌ కోళ్ల ఫామ్‌గేట్‌ రేటు కిలో రూ.100లోపే ఉంది. అయితే 10 రోజులుగా ఈ ధర పెరుగుతోంది. ఇప్పుడు ఫామ్‌గేటులో కోడి ధర కిలో రూ.140-150 మధ్య పలుకుతోంది. చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement