Friday, November 22, 2024

నేడు సమతామూర్తిని దర్శించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ముచ్చింతల్‌లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దర్శించుకోనున్నారు. చిన జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమోరోహంలో రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి నేడు 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు. మధ్యాహ్నాం మూడున్నరకు ముచ్చింతల్‌లోని జీవాశ్రమానికి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేరుకుంటారు. సమతామూర్తి కేంద్రంలో ఆలయాలు, బృహాన్ మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. 4 గంటలకు స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు. కాగా, భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన స్వర్ణమూర్తి ప్రతిష్టాపనకు చినజీయర్‌స్వామి నేతృత్వంలో వేలాది మంది ఋత్వికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ముచ్చింతల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్ వరకు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంట తర్వాత భక్తులెవరిని సమతామూర్తి దర్శనానికి అనుమతించమని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement