కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరుగుతున్న సదరన్ నావల్ కమాండ్ ను సందర్శించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. సతీసమేతంగా కేరళ టూర్ కు వెళ్లారు ఆయన. మంగళవారం ప్రత్యేక విమానంలో కానూరుకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ సాదరంగా ఆహ్వానించారు. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 24 వరకు కేరళలోనే పర్యటించనున్నారు. మంగళవారం కాసర్‌గోడ్‌లో జరిగే కేరళ సెంట్రల్ యూనివర్శిటీ అయిదో స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.
ఈరోజు (బుధవారం) కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్ నిర్వహించే కార్యాచరణ ప్రదర్శనను వీక్షించారు. రేపు (23న) తిరువనంతపురంలో పీఎన్ పనికర్ విగ్రహాన్ని రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. డిసెంబరు 24 ఉదయం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు తెలిపారు.