1931నుండి 1936మధ్య హూవర్ డ్యామ్ ని నిర్మించారు. కాగా అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ దీన్ని జాతికి అంకితం చేశారు.ఈ డ్యామ్ అమెరికాలోని నెవడాలో ఉంది. కాగా హూవర్ డ్యామ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశంలోనే ఇది అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్‌ను కొలరాడో నదిపై నిర్మించారు. బౌల్డర్ సిటీలో ఉన్న డ్యామ్‌లో పేలుడు సంభవించిన సమయంలో అక్కడే టూరిస్టులు ఉన్నారు. ఆ పేలుడుకు సంబంధించిన వీడియోను టూరిస్టులు తీశారు. ఆ వీడియోను వాళ్లు ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు.అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగానే మంటల్ని ఆర్పినట్లు బౌల్డర్ సిటీ తెలిపింది. డ్యామ్‌లో ఉన్న ఓ ట్రాన్స్‌ఫార్మ్‌లో పేలుడు జరిగింది. అయితే పవర్ గ్రిడ్‌కు ఎటువంటి రిస్క్ జరగలేదు. ఎవరు కూడా గాయపడలేదు. ఆ డ్యామ్‌లో 15 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. నెవడా, ఆరిజోనా సరిహద్దులో హూవర్ డ్యామ్ ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement