గతంలో రాష్ట్రపతి ఎలక్షన్స్ త్వరగా జరిగాయి..2017లో అధ్యక్ష ఎన్నికలు జూలై 17న నిర్వహించగా ..విజేతను మూడు రోజుల తర్వాత అంటే జూలై 20న ప్రకటించారు. 2017 సంవత్సరంలో రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే తదుపరి రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అంటే జూలై 24వ తేదీ లోపే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహకాలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంటు ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ. ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులతో భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నుకుంటారు.
ఢిల్లీతో పాటు పుదుచ్చేరిలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.రాజ్యసభ, లోక్ సభ లేదా రాష్ట్రాల శాసన సభల నామినేటెడ్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో చేర్చడానికి అర్హులు కాదు, కాబట్టి వారందరూ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అదే విధంగా శాసనమండలి సభ్యులు కూడా అధ్యక్ష ఎన్నికలకు ఓటర్లు కారు. కాగా ఇంకా రెండురోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలపై రెండు రోజుల్లో నోటిఫికేషన్ ని ఈసీ జారీ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈసారి రాష్ట్రపతి ఎవరు అనేదానిపై చర్చ నడుస్తోంది.