Tuesday, November 19, 2024

డా.బీఆర్.అంబేద్క‌ర్ కు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్​ బీఆర్​​ అంబేడ్కర్​ 65వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ…. డా.బీఆర్‌ అంబేద్కర్‌ 1891, ఏప్రిల్‌ 4న జన్మించారన్నారు. సామన్య దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఆర్థిక‌వేత్తగా, రాజకీయ నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారన్నారు. ఆయన 1956, డిసెంబర్‌ 6న కన్నుమూశారన్నారు. ఆయనకు 1990లో దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అప్పటి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ముందుగా పార్లమెంటు ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలు జల్లి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement