పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన ఓ 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, సోదరుడు కలిసి హతమార్చారు. ఆ యువతిని అడవిలోకి తీసుకెళ్లి నిప్పంటించి సజీవ దహనం చేయడానికి ట్రై చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి కాకుండానే ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లి, సోదరుడు ఆగ్రహంతో మండిపడ్డారు.
కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని ప్రశ్నించగా… ఆమె ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఆమెను ఊరి పక్కనున్న అడవిలోకి లాక్కెళ్లారు. అంతేకాకుండా ఒంటికి నిప్పంటించి సజీవ దహనం చేయడానికి యత్నించారు. అయితే ఈ ఘటనను కొందరు రైతులు గమనించారు. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను మీరట్ ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె మీరట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, బాధితురాలి తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.