హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. తాజా అంశాలు పోలీ సులకు సవాల్‌గా మారాయి. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో విషపదార్థాలు డి-టె-క్ట్ కాలేదని, ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని తేలినట్లు- సమాచారం. తాజాగా నిపుణులు చేసిన టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు- పలు అవయవాల్లో విషపదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ పేర్కొంది. టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్‌కు చేరిందని సమాచారం. ఇప్పటికే ప్రీతిది హత్యా, ఆత్మహత్యా అనేది పోలీసులు ఇంకా తేల్చుకోలేకపో తున్నారు. సూసైడ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేపనిలో పోలీసులు ఉన్నారని, హత్యే అని ప్రీతి కుటు-ంబసభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా మెడికో ప్రీతిది హత్యేనని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. శవానికి ట్రీ-ట్‌మెంట్ చేస్తూ సినిమా చూపిం చారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తోం దని ఆరోపించారు. ప్రీతి కేసులో ఆధారాలను తారుమారు చేశారని విమ ర్శించారు. డెడ్‌బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి ఈ ప్రభుత్వానిదేన న్నారు. ప్రీతి మృతి కేసుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీ-ఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాగా ఇదే కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. మెడికో ప్రీతి కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే.. యాంటీ- ర్యాగింగ్ కమిటీ-, పోలీసులు విచారణ ముమ్మరం చేయగా.. జూనియర్ మెడికో వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీంతో.. ఈ వాంగ్మూలం కీలకంగా మారనుంది.
పోలీస్ విచారణ, యాంటీ- ర్యాగింగ్ కమిటీ-లో కీలక జూనియర్ డాక్టర్ విషయాలను బయట పె ట్టినట్టు- తెలుస్తోంది. ప్రీతి అనస్థీషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను డాక్టర్ ప్రీతి జూనియర్ వెల్లడిం చినట్టు- సమాచారం. పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు- నిర్ధారించారు. జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థి నికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్‌లో పొందుపరిచినట్లు- విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివ రించి తనకు సపోర్ట్ చేయాలని ప్రీతి అర్థించినట్టు- జూనియర్ డాక్టర్ వాంగ్మూ లం ఇచ్చినట్టు- తెలుస్తోంది. తనపై కుట్ర జరుగుతోందని ప్రీతి తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్టు- జానియర్ డాక్టర్ తెలిపింది. ఇదే విషయమై లాస్ట్ కాల్‌లో సహ విద్యార్థితో తన ఆవేదన వ్యక్తం చేసినట్టు- కూడా తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న విచారణ బృందం.. మెడికో ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణలో తెలుస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించేతత్వం, దానికి సంబంధించిన చాట్స్ కూడా లభ్యమైనట్టు- సమాచారం. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలను బేస్ చేసుకుని పోలీసు అధికారులు కేసులో ముందుకెళ్తున్నారు.