అంటార్కిటికాలో ట్రెక్కింగ్ చేయనుంది బ్రిటీష్ ఆర్మీలో ఫిజియోగా చేస్తున్న 33 ఏళ్ల ప్రీత్ చాంది .దాంతో ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నది. గతంలో దక్షిణ ద్రువంలో ట్రెక్కింగ్ చేసి చరిత్ర సృష్టించిన ఆ భారతీయ సంతతిరాలు ఇప్పుడు. ఎవరి సహాయం లేకుండా.. ఒంటరిగా ఆమె అంటార్కిటికా ఖండాన్ని చుట్టిరానున్నది. అంటార్కిటికాలో సుమారు 1100 మైళ్ల దూరం ఆమె ట్రెక్ చేయనున్నది. ఈ ఏడాది జనవరిలో దక్షిణ ద్రువంలో 700 మైళ్లు నడిచి ఆమె రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 40 రోజుల్లోనే ఆమె ఆ ట్రిప్‌ను పూర్తి చేసింది. ఇక అంటార్కిటికా ట్రిప్ కోసం ఆమె 120 కిలోల లగేజీతో ట్రెక్ మొదలుపెట్టనున్నది . అక్కడ మైనస్ 50సీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. సుమారు గంటకు 60 మీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రీతి చాంది ట్రెక్కింగ్‌కు వెళ్లనున్నది. బ్రిటీష్ ఆర్మీలో ఆమెను పోలార్ ప్రీతిగా పిలుస్తారు. అంటార్కిటికాలో ఆమె 75 రోజులు జర్నీ చేయనున్నది. ఆరంభంలో నెమ్మదిగా వెళ్తూ.. ఆ తర్వాత ఆమె తన వేగాన్ని పెంచుకుంటుందని బ్రిటీష్ ఆర్మీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement