మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. దాంతో మసీదు ఇమామ్ సహా 20మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆప్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో జరిగింది. ఈ ప్రమాదంలో 40మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మసీదులో ప్రార్ధనలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని, పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటివరకు పేలుళ్లకు బాధ్యత విహిస్తూ ఏ సంస్థా ప్రకటించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్ పోలీస్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement