Friday, November 22, 2024

Big Breaking: కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరించిన పీకే

ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేదా? అన్నప్రశ్నకు క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే నిరాకరించారు. కాంగ్రెస్ లో చేరాలని ఆపార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పీకేను కోరారు. అయితే, కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ను పీకే తిరస్కరించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ధృవీకరించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో ప్రకటించారు.

ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నార‌న్న వార్త‌లు వినిపించాయి. పార్టీలోకి పీకే చేరిక‌ను వ్య‌తిరేకిస్తున్న కొంద‌రు నేత‌ల‌ను ఒప్పించే ప‌నిని సోనియా చేప‌ట్టార‌ని, సోనియా చ‌ర్చ‌ల‌తో వారు కూడా మెత్త‌బ‌డ్డార‌న్న వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరిపోవ‌డం ఖాయ‌మైపోయింద‌ని, ఆయ‌న‌కు పార్టీ కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నుంద‌ని కూడా ప్రచారం సాగింది. నిర్దిష్ట‌మైన బాధ్య‌త‌ల‌తో పార్టీలో చేరాల‌ని స్వ‌యంగా సోనియా ప్ర‌తిపాదించ‌గా..అందుకు ప్ర‌శాంత్ కిశోర్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement